తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ మహిళా నేత హల్చల్ సృష్టిస్తోందట. ప్రాధానత్య లేని వారికి టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ఏఐసీసీలో ఉన్న ఓ తెలంగాణ కీలక నేత గల్లీలో ఒకలా ఉంటే ఢిల్లీకి వేరే రిపోర్టులు పంపుతున్నట్లు.. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను కాకుండా నియోజకవర్గంలో పెద్దగా తిరగని నాయకుల గ్రాఫ్ పెంచి చూపిస్తూ రిపోర్టులు పంపుతున్నట్లు సమాచారం అందుతోంది.
పాత తరం కాంగ్రెస్ నాయకులను అడ్డు తొలగించుకోవడానికి సర్వేలు అడ్డుపెట్టుకుంటున్నారు కొందరు కీలక వ్యక్తులు. ఇక పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఏఐసీసీ సభ్యురాలిగా ఎన్నికైన ఓ మహిళా నేత.. సనత్ నగర్ గ్రౌండ్ లెవెల్లో పెద్దగా అసలు అవగాహన లేకపోయినా టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు వాడుకొని టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.