లేడీ సూపర్ స్టార్ నయనతార.. సినిమాల ఎంపికలో ఈ భామ రూటే సపరేట్. ఇక సినిమా ప్రమోషన్స్‌లో ఈ బ్యూటీ అస్సలు పాల్గొనదు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామకు ఎక్కడా అకౌంట్ లేదు. తన పర్సనల్ లైఫ్‌ను చాలా గోప్యంగా ఉంచడానికే ఈ భామ ఇష్టపడుతూ ఉంటుంది. ఇక తన సినిమా ప్రమోషన్స్, బర్త్ డే, మ్యారేజ్ ఆనివర్సరీ.. ఇలా స్పెషల్ అకేషన్స్ అన్నింటికి తన భర్త విఘ్నేశ్ శివనే తన పర్సనల్ అకౌంట్లో పోస్టులు పెడుతుంటాడు.
అయితే తాజాగా నయనతార తన రూట్ మార్చేసింది. ఇన్నాళ్లూ నెట్టింటికి దూరంగా నయన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో.. తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని మాస్ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదొ అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చి చేరారు. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నయన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి వచ్చింది. ఇక నయన్ ఇన్‌స్టాలో ఐదుగురిని ఫాలో అవుతుంది. అందులో భర్త విఘ్నేష్, షారుఖ్ ఖాన్, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్ సంస్థ ది రౌడీ పిక్చర్స్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాను ఫాలో అవుతోంది.