భూమికి విత్తుకి ఎంత అనుబంధముందో.. రైతుకు, కాంగ్రెస్ కి అంతే అనుబంధముంది : సీఎం రేవంత్ రెడ్డి

-

భూమికి విత్తుకి ఎంత అనుబంధముందో.. రైతుకు, కాంగ్రెస్ కి అంతే అనుబంధముందని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే అని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసారు.

భూమి లేని పేద రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12వేలు సంవ్సరానికి అందిస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వని విధంగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అనగానే వైఎస్సార్ గుర్తుకొస్తారు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అధికంగా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం కోసమే రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version