రోహిత్ మీరు రిటైర్ అవ్వకండి.. మీరున్నారనే నేను క్రికెట్ చూస్తున్నా!

-

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్టు, వన్డేలకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ టోర్నీలో టీమిండియా దారుణంగా విఫలమైంది. దీంతో రోహిత్ శర్మ క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని చాలా మంది కామెంట్స్ చేశారు.

రోహిత్ ఆ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచుల సిరీస్ లో ఒక అర్దసెంచరీ కూడా చేయలేకపోయాడు. తన ప్రదర్శనపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించిన రోహిత్.. తను రిటైర్మెంట్ ప్రకటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రంజీల్లో తన ఫిట్నెస్ ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు ఓ అభిమాని లేఖ రాశాడు.‘నేను క్రికెట్ చూసేందుకు మీరే కారణం. మీ మధ్యకాలంలో మీరు విఫలమవుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి ఫామ్ లోకి వస్తారని ఆశిస్తున్నా.. రంజీలో మీరు కొట్టిన సిక్సర్లు అద్భుతం. మీరు ఎప్పుడూ రిటైర్ అవ్వకండి. మైదానంలో మీరు ప్రతి ఫార్మాట్ లో అదరగొడతారు’ అని ఇన్ స్టా ఐడీలో రాసుకొచ్చాడు.ఈ లేఖను బీసీసీఐ షేర్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version