రైతులు బ్యాంక్ రుణాలు కట్టకండి – బీఆర్ఎస్

-

బ్యాంక్ రుణాలు రైతులు కట్టకండని మాజీ మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు. రైతులు ధైర్యంగా ఉండండి.. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వంపై పోరాడి వాళ్లతో లోన్లు కట్టిస్తామని తెలిపారు. రైతులకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని వివరించారు హరీష్ రావు.

కేసీఆర్ హయాంలో ఎక్కడ బోర్ బండ్లు, బావుల్లో పూడిక తీసే మిషన్లు కనిపించేవి కావు.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నీరు లేక బావుల్లో పూడిక తీసే మిషన్లు, బోర్ బండ్లు కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. ఈ కష్టాలు చాలవు అన్నట్లు ఇప్పుడు బ్యాంక్ వాళ్లు కూడా రుణాలు కట్టండి అని రైతులకు నోటీసులు పంపుతున్నారని నిప్పులు చెరిగారు హరీష్ రావు. నీళ్లు లేక 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది….రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసిన నీళ్లు పడటం లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version