రేవంత్ రెడ్డి దొరా నీ కాళ్ళు మొక్కుతాం వడ్లు కొనండి అంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వడ్లు తడుస్తున్నాయి దయచేసి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనండి అంటూ భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు కలెక్టరేట్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం వారు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే.. రైతులు వారి కాళ్లు మొక్కుతూ.. తమ బాధలు తీర్చాలని వేడుకున్నారు.
ఇక అటు సన్న వడ్లు వేస్తేనే 500 రూపాయల బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాలికొదిలేసింది. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సరిగా అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ హామీలలో 500 రూపాయల బోనస్ ఒకటి. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రచారంలో చెప్పింది. ఎన్నికల హామీలు కూడా వెల్లడించింది.