పల్లా రాజేశ్వర్‌రెడ్డి దంపతులపై బెదిరింపు కేసు

-

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్‌ నేత పల్లారాజేశ్వర్‌ రెడ్డి దంపతులపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్‌ ఠాణాలో ఆయనతో పాటు భార్య నీలిమ, మధుకర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్‌ జిల్లా ఫీర్జాదిగూడలోని బుద్ధనగర్‌కు చెందిన ముచ్చర్ల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఏం జరిగిందంటే?

ఘటకేసర్‌ మండలం చౌదరిగూడలో సర్వే నంబరు 796లో ఉన్న భూమిలో వెంచర్‌ వేయగా.. 2020లో సదరు లేఔట్‌లోని 150 చదరపు గజాల స్థలాన్ని మల్లేశం అనే వ్యక్తి నుంచి రాధిక కొనుగోలు చేశారు. కొంతకాలం క్రితం ఈ స్థలంలోకి గాయత్రి ఎడ్యుకేషన్‌ ట్రస్టు నిర్వాహకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నీలిమ, మధుకర్‌ రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించి స్థలంలో పాతి స్తంభాలను తొలగించారని రాధిక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతలను పూడ్చేశారని.. తప్పుడు పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో వివరాలు మార్చి స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై కేసులు బనాయించారని ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టించారు. చట్టం, న్యాయం మీద నమ్మకం ఉందని పల్లా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version