అయోధ్యలో 45 రోజుల సంగీత ఉత్సవం

-

ఈనెల 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. లక్షల మంది భక్తులు ప్రతిరోజు అయోధ్య బాలరాముణ్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Ayodhya Bala Rama Name Changed

ఇందులో భాగంగా అయోధ్య బాల రాముడికి అంకితమిస్తూ శుక్రవారం నుంచి భక్తి సంగీత ఉత్సవం ప్రారంభమైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10వ తేదీ వరకు 45 రోజులపాటు కొనసాగనుంది. శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాద్యాలు ‘మంగళ ధ్వని’లో భాగం కానున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version