మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు !

-

Fire on the 9th floor of EIPL apartment in Manikonda: మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ మహా నగరంలో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు. దీంతో భయంతో బయటికి పరుగులు తీసారు అపార్ట్మెంట్ వాసులు.

A sudden fire broke out on the 9th floor of an EIPL apartment in Manikonda

ఈఐపీఎల్ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం చేసిన ఫ్లాట్ యజమాని సంతోష్… గృహప్రవేశం చేసిన తర్వాత దేవుడి గదిలో దీపం పెట్టి నిద్రపోయారట. అయితే… ఇవాళ ఉదయం తెల్లవారుజామున దీపం ఎదురుగా ఉన్న కళశంకు అంటుకున్నాయి మంటలు. దేవుడి గదికి అనుకొని కిచెన్ ఉండడంతో గ్యాస్ ను ఆఫ్ చేసి కిందికి దిగిపోయారట కుటుంబ సభ్యులు. ఇక మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. హాలు, రెండు బెడ్ రూమ్ లు, కిచెన్, దేవుడి గది కాలిబూడిదయ్యాయి. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version