ఐదుగురు TSPSC బోర్డు సభ్యులు రాజీనామా..!

-

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్ దగ్గర మాత్రం ఈ రాజీనామా పెండింగ్ లోనే ఉంది. ఇదిలా ఉండగానే తాజాగా ఇవాళ టీఎస్పీఎస్సీకి చెందిన ఐదుగురు బోర్డు సభ్యులు రాజీనామా చేశారు.  టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు సత్యనారాయణ తో పాటు మరో నలుగురు కూడా ఇవాళ రాజీనామా చేశారు. బండి లింగారెడ్డి కోట్ల అరుణకుమారి సుమిత్ర ఆనంద్ కారం రవీంద్రారెడ్డి చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పాలు పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం, పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహణపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు.

టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండు రోజులు టిఎస్పిఎస్సి బోర్డు సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి కమిషనర్ అనిత రామచంద్రన్ ఇతర అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ తరుణంలోనే బోర్డు చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు రాజీనామాలు చేయడం ఇ మెయిల్ప్పుడూ హాట్ టాపిక్ గా మారింది. టీఎస్పీఎస్సీ బోర్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని నిరుద్యోగులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version