తెలంగాణ మందుబాబులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటు వంటి బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2, 620 వైన్ షాపులు ఉన్నాయి. అందులో చాలా వరకు కుదించే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. మద్యం దుకాణాల టైమ్ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు కూడా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో.. తెలంగాణ మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.
అలాగే…తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంకా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు.