Flying Monkey beers in telangana: ఫ్లయింగ్ మంకీ.. తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీఆర్‌ఎస్ పార్టీ ముందు నుంచి చెప్పినట్లుగానే… తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. ఫ్లయింగ్ మంకీ పేరుతో తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. ఇక ఇది ఇలా ఉండగా.. తెలంగాణ సర్కార్ పై క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
మంత్రి జూపల్లి వారం రోజుల్లో రెండు మాటలు మాట్లాడాడు….మే 21న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ఎలాంటి మద్యం కంపెనీలు కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని, అలా ప్రచారం చేస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని బెదిరించారని ఆగ్రహించారు మన్నె క్రిశాంక్.
మళ్లీ మే 28న మంత్రి జూపల్లి కృష్ణారావు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు అనుమతులు ఇవ్వడం వాస్తవమే కానీ, తనకు సమాచారం లేదని కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారని అన్నాడు…ఒక మంత్రికి తెలియకుండా కార్పొరేషన్ వారు అనుమతులు ఇస్తారా? తెలంగాణలో కల్తీ మందుకు అనుమతులు ఇవ్వొద్దని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు మన్నె క్రిశాంక్.