Telangana: గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత !

-

గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగిందని సమాచారం అందుతోంది. 84 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారట. ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చిందని సమాచారం. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుందట. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టారట విద్యార్థులు. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించారట ప్రిన్సిపల్.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించగా.. వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్. ఈ క్రమంలో కొంత మంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించడంతో బయటకు ఈ విషయం వచ్చిందట. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే వెళ్లగా గురుకులానికి తాళం వేసి వాళ్లను అడ్డుకున్నారట ప్రిన్సిపల్.
ఇక దీనిపై పోలీసులను పిలిపించిన తర్వాత తల్లిదండ్రులను లోపలికి వదిలారట ప్రిన్సిపల్.. కనీసం సమాచారం ఇవ్వక పోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news