BREAKING : బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు సంజీవ రావు, శ్రీదేవి

-

కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ పార్టీలో తాజాగా మాజీ ఎమ్మెల్యేలు సంజీవ రావు, శ్రీదేవి చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి సమక్షం లో బీజేపీ లో చేరారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు సంజీవ రావు, శ్రీదేవి.

ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి కూడా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లోని పది అసెంబ్లీ స్థానాలకు పది గెలుస్తామని… పది మంది సీనియర్ నేతలు మతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని బీజేపీ పార్టీలో చేరుస్తామని…BRS ను ఓడించేది బీజేపీ నే అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version