తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. నల్గొండ జిల్లా అప్పాజీపేటలో మహిళా రైతు భిక్షమమ్మ (46), మహబూబాబాద్ జిల్లా ఓతాయిలో గొర్రెల కాపరి చేరాలు (55), గుడెంగలో ప్రవీణ్ కుమార్ (27) అనే వ్యక్తి, వనపర్తి జిల్లా మియాపూర్‌లో కొరవ నాగరాజు (18) అనే యువకుడు పిడుపాటుకు ప్రాణాలు కోల్పోయారు.

Four killed in lightning strike in Telangana state
Four killed in lightning strike in Telangana state

మరో 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణశాఖ అధికారులు. ఇది ఇలా ఉండగా…. హైదరాబాద్ మహానగరంలో నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల కార్లు కూడా మునిగిపోయాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జనాలంతా చాలా కష్టాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news