తెలంగాణలో ఫ్రాన్స్‌కి చెందిన టెలిపెర్మార్మెన్స్‌ కంపెనీ పెట్టుబడులు

-

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఫ్రాన్స్‌కి చెందిన టెలిపెర్మార్మెన్స్‌ కంపెనీ ముందుకొచ్చింది. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని .కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతాలంబ తెలిపారు. ఈ మేరకు టెలిపెర్మార్మెన్స్‌ ప్రతినిధులు.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు ఈనెల 5 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి శ్రీధర్‌బాబుని ఆహ్వానించారు.

తమ సంస్థలోదేశవ్యాప్తంగా 90 వేలమంది ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని టెలిఫెర్మార్మన్స్ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. టెలిపెర్ఫార్మన్స్ పెట్టుబడులు, కార్యకలాపాకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ థేయిరి బెర్తెలోట్‌ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అనువైన వాతావరణంపైమంత్రి శ్రీధర్‌బాబు బెర్తేలోట్‌కి వివరించారు. హైదరాబాద్‌ టీహబ్‌లో త్వరలోనే ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయం ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ తెలిపారు. ఆ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబును ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version