రేపు మహా శివరాత్రి పర్వ దినం. ఈ నేపథ్యంలో… శివుని భక్తులు.. శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఎక్కడ రాజన్న ఆలయాలు ఉన్నా… భక్తులు అక్కడ వాలిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్య క్షేత్రానికి రాజన్న భక్తులు పొటెత్తుతున్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వేములవాడకు వెళ్లే భక్తుల కోసం.. ప్రత్యేకంగా మిని బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. మొత్తం 14 మిని బస్సులు ఏర్పాటు చేసామని.. వాటిలో వేములవాడకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంటుందని ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కాగా.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి మహా శివరాత్రి ఉత్సవాలు.. నేటి నుండి మూడు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు జరుగనున్నాయి. మార్చి 1 తేదీన మహా శివరాత్రి పర్వదినం కాగా.. సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees pic.twitter.com/fSIDw3Vvum— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022