మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ బస్సుల్లో 15% పెరిగిన రద్దీ

-

తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చింది. ఈనెల 9వ తేదీన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.

గత ఆదివారంతో పోలిస్తే ఈ ఆదివారం దాదాపు 15 శాతం రద్దీ పెరిగినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేసి.. శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో బస్సులు నడిపించాలని టీఎస్​ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో 31-32 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుస్తుండగా.. ఈ రోజు  ఆ సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దింతో మరో 10 శాతానికిపైగా బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version