తెలంగాణలో మందగించిన రిజిస్ట్రేషన్ల రాబడి

-

తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలలుగా సాగు భూముల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గింది. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం కాస్త మందగించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల కారణంగానే భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయని నిపుణులు చెబుతున్నారు. గత అక్టోబర్​లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అప్పటి నుంచి భూముల క్రయవిక్రయాలపై ప్రభావం పడిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుకున్నంత మేర రాబడి రాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు సుమారు 8 వేల 450 కోట్ల రాబడి నమోదయిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇది 8 వేల 356 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఆదాయం పర్వాలేదనిపించినా అభివృద్ధి శాతం పరంగా చూస్తే మాత్రం ఇది స్వల్పమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక డిసెంబరు నుంచి మార్చిపై జరగబోయే క్రయవిక్రయాలపైనే ఆశలు ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version