తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ్టి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చును. ఈ మేరకు నిన్ననే మహాలక్ష్మి పథకంపై జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. మహిళలు, ఆడ పిల్లలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా అందించనుంది రేవంత్ రెడ్డి సర్కార్.
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణం అందించనున్నారు. ముఖ్యంగా అంతరాష్ట్ర సర్వీసుల్లో సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితంగా ఉండనుంది. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే తెలంగాణ రాష్ట్ర మహిళలు ప్రయాణం చేయవచ్చును. మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ మహాలక్ష్మి పథకం కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వంపై భారం పడనుంది.