హరీష్ రావుకు కొత్త పేరు పెట్టిన మధుసూదన్ రెడ్డి..!

-

పాలమూరు ముద్దుబిడ్డ ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అడిగిందే తడువుగా సాంక్షన్స్ ఇస్తున్నారు. నేను అడిగిన వెంటనే 170కోట్ల రూపాయల వ్యయం అయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు అని డీసీసీ అధ్యక్షులు జీ.మధుసూదన్ రెడ్డి అన్నారు. మా హయంలోనే కోయిల్ సాగర్, సంఘం బండ,జూరాల,భీమా ప్రారంభం కాాబడ్డాయి. ఇంకా కొంత పెండింగ్ పనులున్నాయి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాము.

ఏనాడు ఈ ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రాలను పట్టించుకున్న పాపాన పోనీ నాయకులు ఈరోజు కురుమూర్తి రాయున్నీ సందర్శించుకోడానికి వచ్చారంటే అది కేవలం ఈ ప్రాంత బిడ్డ సీయం రేవంత్ ను అభాసు పాలు చేసే ప్రయత్నమే తప్పా వేరే కాదు. నీ పేరు హరీష్ రావు కాదు కుళ్ళేశ్వర్ రావు. 2015 లో పాలమూరు రంగా రెడ్డి ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మీ మామ కేసీఆర్ అన్న మాట మరిచావా హరీష్ అని ప్రశ్నించారు. పాలమూరు కంటే ఒక్క సంవత్సరం తరువాత ప్రారంభం అయినా కళేశ్వరాన్ని మాత్రం ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు. ఎన్నికల స్టంట్ కోసం ఆగమేఘాల మీద 2 పంపుల స్టార్ట్ చేసారు. పాలమూరు రంగా రెడ్డి నీ ఆపడానికి కేసు వేసిన హర్ష వర్ధన్ రెడ్డి నీ పక్కన 4 ఏళ్లు ఉంచుకొని ఎందుకు కేసులు ఎత్తి వేయించలేదు. కోయిల్ సాగర్ ద్వారా 50వేల ఎకరాల కు నీళ్ళు అందిస్తామనీ హరీష్ 2017 లో నువ్వే అన్నమాట ఎక్కడ పోయింది అని అడిగారు మధుసూదన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version