ఇదేం ప్రజాపాలన.. మానుకోటలో పోలీసుల కవాతు దేనికి సంకేతం : కేటీఆర్

-

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు పోలీసు బలగాలు కవాతు నిర్వహించడం దేనికి సంకేతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజాపాలన? అసలు మానుకోటలో ఏం జరుగుతుందని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు..మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటని, అక్కడ గొడవలు ఏం జరగలేదు..మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకని నిలదీశారు.

అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుందని, ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్షల పాలన, ఆంక్షల పాలన..మొత్తంగా రాక్షస పాలన’ అవుతుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఖబర్దార్ రేవంత్..ఇది తెలంగాణ..ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version