హైదరాబాద్‌లో నేటి నుంచి వినాయక నిమజ్జనాలు

-

మహారాష్ట్రను మించి హైదరాబాద్​లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. వాడవాడనా వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసి గణపయ్యకు పూజలు చేస్తున్నారు. డప్పు చప్పుళ్లు, భజనలు, లంబోదరుడి నామస్మరణంతో హైదరాబాద్​లోని వీధులన్నీ మార్మోగుతున్నాయి. నగరంలో ఈ ఏడాది 90వేల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. మూడ్రోజులుగా ఆ గణపతి మహాదేవుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో మూడో రోజైన నేటి నుంచి నగరంలో వినాయక నిమజ్జనం ప్రారంభం కానుంది. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నెక్లెస్‌రోడ్డు ట్యాంక్‌బండ్‌ పై క్రేన్లను ఏర్పాటు చేశామని.. ఈ నెల 28వ తేదీన మహాగణేశ్‌ నిమజ్జనం ఉంటుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఏడాది కంటే 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించారని, దానికి తగ్గట్టుగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతం చేయాలని అధికారులకు మంత్రి తలసాని దిశానిర్దేశం చేశారు. నిమజ్జనానికి ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాట్లు చేస్తామని, ఒత్తిడి లేకుండా చాలా చోట్ల బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గణేశ్‌ మండపాల నిర్వాహకులు ముందుగానే ఏ రూట్‌లో వచ్చి ఏ ప్రదేశంలో నిమజ్జనం చేయాలన్న విషయం తెలియజేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version