తెలంగాణ రాష్ట్ర టీచర్లకు బిగ్ అలర్ట్. టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు అయింది. తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో టీచర్లకు అమలవుతున్న బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
బయోమెట్రిక్ పరికరాలు సరిగ్గా పని చేయకపోవడంతో బయోమెట్రిక్ హాజరును రద్దు చేశామని, ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన తెలిపారు.
ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DSC ద్వారా భర్తీ చేయనున్న టీచర్ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలతో పాత రోస్టర్ కు ముగింపు పలికిన ప్రభుత్వం రోస్టర్ ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్లను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో చూడవచ్చు. 5,089 పోస్టుల్లో 2,638 పోస్టులను మహిళలకు కేటాయించారు.