తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర చాలా కీలకమైనదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించారు. అనంతరం గీతా కార్మికులతో సహపంక్తి భోజనం చేసారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గౌౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈత, తాటి చెట్లను పెంచాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిన వద్ద చెట్లను పెంచాలని సూచించారు.
ఎక్కడ చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల గట్ల వద్ద తాటి, ఈత చెట్లను పెంచేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక తీసుకుంటుందని తెలిపారు. సేప్టీ మోకుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నుంచి రక్షణకు కాటమయ్య రక్షణ కవచం ఉపయోగపడుతుందన్నారు. కులవృత్తులను కాపాడుదాం. గౌడన్నలు పౌరుషానికి ప్రతీక అన్నారు. గౌడన్నలకు ఉపాధి అవకాశాలను పెంచుతామని హామి ఇచ్చారు. బలహీన వర్గాల వారు పాలకులుగా మారాలంటే చదువే ఆయుదం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.