GHMC కీలక నిర్ణయం తీసుకుంది. శానిటేషన్ జవాన్లపై బదిలీ వేటు వేసింది GHMC. GHMC పరిధిలో పని చేసే 139 మంది శానిటేషన్ జవాన్లను ట్రాన్స్ ఫర్ చేశారు GHMC కమిషనర్ ఇలంబర్తి. 259 మంది శానిటేషన్ జవాన్లు ఉంటే, అందులో ఐదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారిని బదిలీ చేసినట్లు తెలిపారు కమిషనర్ ఇల్లంబర్తి.
ఈ మేరకు GHMC కమిషనర్ ఇలంబర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్ జవాన్లపై బదిలీ వేటు వేసిన GHMC వ్యూహం ఏంటో తెలియాల్సి ఉంది.