కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సతాపూర్‌లో జరిగిన దాడి మరవముందే, తాజాగా నార్యనాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు విచక్షణరహితంగా దాడి చేసినట్లు తెలిసింది.
ఈ దాడిలో ఒకరిద్దరికీ తలలు పగిలినట్లు తెలుస్తోంది. రక్తపు మరకలతో పాటు కుట్లు కూడా పడినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ చిత్రాలు చూసేందుకు చాలా భయానకంగా ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్, నేడు కాంగ్రెస్ పాలనలో దాడులు, హత్యలు, అరాచకాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుందని స్థానిక గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెచ్చు మీరుతున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు
నిన్న సతాపూర్ లో జరిగిన దాడి మరవముందే నార్యనాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులపై విచక్షణరహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు
కొల్లాపూర్ లో ఇన్ని దాడులు జరుగుతున్న చోద్యం చూస్తున్న పోలీసులు
బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా… pic.twitter.com/7GVOzOdgTd
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) March 1, 2025