‘నాకు ఖమ్మం నుంచి టికెట్ ఇవ్వండి’ : వీహెచ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

నల్లగొండ, చేవెళ్ల, జహీరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలను ఈనెల 20 తరువాత ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. నా పేరును లిస్ట్ లో లేకుండా చేసారు. ఎందుకు అంత కక్ష గట్టారు..? కాంగ్రెస్ వల్లే కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. నాకేం వయస్సు అవ్వలేదు. నా అంత చురుకుగా పని చేసేవారు పార్టీలో ఇంకొకరు లేరు. ఈసారి అయినా టికెట్ ఇస్తే నేను తప్పనిసరిగ్గా గెలుస్తానని తెలిపారు వీహెచ్. నాకు ఖమ్మం నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version