దీపావళి రోజున తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే ?

-

Gold Rates : మగువలకు గుడ్ న్యూస్.. దీపావళి రోజున బంగారం ధరలు తగ్గిపోయాయి. గడిచిన మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు… నిన్న పెరిగిపోయాయి. ఇక ఇవాళ తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 460 తగ్గి, రూ. 60, 630 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి, రూ. 55, 550 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 76, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version