Breaking News : కాంట్రాక్టు ఉపాధ్యాయులకు శుభవార్త.. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం

-

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధ్యాయుల క్రమ బద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నది.

దాదాపు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్దతిలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులను క్రమబద్దీకరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక  రాష్టం తెలంగాణ అని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. టెట్ లో లో క్వాలిఫై అయిన వారందరూ టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాల వారి జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపిస్తారు. ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడుతారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version