ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్.. కల్యాణ ల‌క్ష్మి వ‌ర్తిస్తుంది : మంత్రి గంగుల‌

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్యాణ లక్ష్మి, షాది ముబ‌ర‌క్ అనే ప‌థ‌కాల‌ను ఎంతో ప్ర‌తిష్టత్మ‌కంగా అమ‌లు చేస్తుంది. పెళ్లి స‌మ‌యంలో పెళ్లి కుమార్తే కుటుంబ స‌భ్యుల‌కు సాయం చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా పెళ్లి చేసుకునే పెళ్లి కుమార్తే కుటుంబ స‌భ్యుల‌కు రూ. 1,00,116 ను ఆర్థిక సాయం చేస్తుంది. దీని కోసం ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ లో రూ. 1,450 కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయిస్తుంది.

కాగ క‌ల్యాణ ల‌క్ష్మి, షాదిముబార‌క్ ప‌థ‌కాల అమ‌లుపై రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా ఈ ప‌థ‌కాలు అమ‌లు వ‌ర్తిస్తుంద‌ని అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. భర్య బీసీ అయి.. భ‌ర్త ఓసీ అయినా.. క‌ల్యాణ ల‌క్ష్మి వ‌ర్తిస్తుంద‌ని వారికి చెక్ లు పంపిణీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విషయంలో ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌మస్య కూడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే ఎక్క‌డైనా.. ఈ విషయంలో క‌ల్యాణ ల‌క్ష్మి, షాదిముబారక్ ప‌థ‌కాలు వ‌ర్తింపు కాకుండా ఇబ్బందులు ఎదురైతే.. త‌మ దృష్టికి తీసుకురావాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version