తెలంగాణలో కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త అందింది. ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పెరిగే ఇసుక ధరలు… ఈ ఏడాది మాత్రం భిన్నంగా తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంలో సన్న ఇసుక రూ. 2,600 నుంచి రూ. 3000 ఉండగా… ప్రస్తుతం టన్ను ఇసుక రూ. 1500-1,550కే లభిస్తోంది. దొడ్డు ఇసుక టన్ను రూ.1200కు అమ్ముతున్నారు.
ఇసుకను TSMDC విక్రయిస్తుండగా… నిన్నటికీ 61,900 టన్నులు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. గత ఏడాది ఇదే సమయానికి రోజుకు 15-20 వేల టన్నులే ఆన్లైన్లో ఉండేది. తెలంగాణలో ఇసుకను టీఎస్ఎండిసి ఆన్లైన్ లో విక్రయిస్తోంది. గతంలో వర్షాకాలంలో ఆన్లైన్ బుకింగ్ రోజుకు 15 నుంచి 20వేల టన్నులలోపే అందుబాటులో ఉండేది. ఈసారి ఆగస్టులో 50వేల టన్నులకు పైగానే అందుబాటులో ఉంది. ఇక ఆదివారం అయితే 61,900 టన్నుల ఇసుకను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.