సమంత ఎక్కడ.. విజయ్​ దేవరకొండను అడిగిన నాగ్​.. హోరెత్తిన బిగ్​బాస్ ఆడిటోరియం

-

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్​బాస్-సీజ్-7 వచ్చేసింది. ఆదివారం రోజున తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈషోలో ఈ సీజన్ కంటెస్టులను ఆయన పరిచయం చేశారు. అయితే బిగ్​బాస్-7 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్​కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చారు. తమ సినిమాలు ఖుషి, మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్​ కోసం ఈ వేదికపై సందడి చేశారు.

అయితే ఈ వేదికపై విజయ్ దేవరకొండను నాగార్జున సమంత గురించి అడిగి అందరికీ షాక్ ఇచ్చారు. ఖుషీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌ ఆరాధ్య అనే పాటకు లైవ్ పర్‌ఫర్మామెన్స్‌ ఇచ్చాడు విజయ్. ఈ క్రమంలోనే నాగ్.. విజయ్‌ మీ హీరోయిన్‌ సమంత ఎక్కడ అంటూ అనేశాడు. దీంతో ఆడిటోరియం మొత్తం హోరెత్తింది. నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత సామ్ గురించి నాగ్ మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version