విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు సెలవు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవస్తలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ.. మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కూడా పండుగ వేళలో సెలవులను పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. జులై 16, 17 రెండు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ముఖ్యంగా ముస్లిం  ఉద్యోగులకు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొహర్రంను షియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు. మొహర్రం ఇస్లామీయ కాలెండర్ లోని మొదటినెల, ఇస్లామీయ సంవత్సరాది. మొహర్రం మాసం ప్రారంభం రోజున ఇస్లామ్ కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ ని ఉపయోగించేవారట. హజరత్ ఇమాం హుసేన్ను స్మరిస్తూ.. తమ సంతాపం తెలుపుతారు. రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. అయితే మొహర్రం సందర్భంగా తెలంగాణ సర్కారు రెండ్రోజులు హాలీడేస్ ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. 16, 17 తేదీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఈ వార్త విన్న తెలంగాణ విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version