తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్ డే.. విభజన సమస్యలకు చెక్ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..? CMల ఫస్ట్ మీటింగ్‌లో జరిగేదేంటి? అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చర్చించబోతున్నారు. గత ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్ లోని ప్రజా భవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీపై ఎంపీ రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సఫలం కావాలన్నారు. గతంలో ఇద్దరు నేతలు కలిసి ఒకే పార్టీలో పని చేశారని, వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండొచ్చని అన్నారు. భేటీలో ముఖ్యంగా న్యాయపరమైన ఆస్తుల విషయంల సుధీర్ఘ చర్చలు జరిపి వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలంటూ రఘునందన్ రావు కీలక కామెంట్ చేశారు.