తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఇవాళ మూడో తేదీ…. కావున… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పుట్టి స్థాయిలో జీతాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ తాజాగా ప్రకటన చేసింది. మొన్న ఒకటో తేదీన సాంకేతిక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయి. ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదు.
అయితే ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేయడం జరిగింది. దీంతో పలువురు ఖాతాలలో గురువారం రాత్రి జమ అయ్యాయి డబ్బులు. ఇక ఇవాళ మిగతా డబ్బులు కూడా పడిపోనున్నాయి. అటు జనవరి ఒకటో తేదీన సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగిందా సంగతి మనందరికీ తెలిసిందే. కానీ సాంకేతిక కారణాలవల్ల… జీతాలు జమ కాలేదట.