తెలంగాణ రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. తాజాగా సన్న బియ్యం పై మరో ప్రకటన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు దారులకు ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక మనిషికి ఆరు కిలోలు ఇవ్వాలని… మన శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దొడ్డు బియ్యం కూడా ఒక్క మనిషికి ఆరు కిలోలు ఇస్తున్నారు. సన్న బియ్యం కూడా అలాగే ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం… వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని అనుకుంటోందట. అందుకే… రెండు నెలలు ఆలస్యంగా… సన్న బియ్యం పంపిణీ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక ఫిబ్రవరి లేదా మార్చిలో కచ్చితంగా సన్న బియ్యం పంపిణీ ఉంటుందని చెబుతున్నారు.