తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డబ్బులు ఖాతాలో ఎప్పుడు పడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇవాళ, రేపు బ్యాంకులకు సెలవులు ఉండడంతో 28న (మంగళవారం) సాయంత్రం 5 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే మంత్రి హరీష్ రావు మాత్రం సోమవారం ఉదయమే ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. బ్యాంకులు మూసి ఉంటే డబ్బులు ఎలా వేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా, నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 86 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 27న షాద్ నగర్, చేవెళ్ల, అందోలు, సంగారెడ్డి….28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు కలిపి ఒకే చోట సభలు నిర్వహించనున్నారు. అనంతరం గజ్వేల్ సభతో సీఎం ప్రచారం ముగియనుంది.