Good news for the women of Telangana Dwakra Sanghas: తెలంగాణ డ్వాక్రా సంఘాల మహిళలకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున అందిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి… డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటన చేశారు.
సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లో అంబానీ, ఆదానీలే కాదు.. తెలంగాణ మహిళలను సోలార్ ప్లాంట్స్ ఏర్పాటులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా మారడంలో తెలంగాణ దేశానికే మోడల్ కాబోతోందని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాది… ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.