ఏపీలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఏ గంగ 1600 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగించింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు సర్కార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. మూడు నెలల ముందస్తు నోటీసు ఇచ్చాకే తొలగించామని కోర్టు తీర్పు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై విరుచుకుపడుతోంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లో యూనియన్.
వీరి అర్హతలపై 2002లో న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వీరిని తొలగించాల్సి… వచ్చింది. 2013లో జీవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ జీవో చెల్లదని తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.ఇలాంటి నేపథ్యంలోనే 1600 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అను తొలగించింది చంద్రబాబు నాయుడు సర్కార్.