నెక్కొండలో ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాప్ కు పచ్చజెండా

-

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో.. ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాప్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది.

Green flag for Intercity Super Fast Express stop at Nekkonda

నెక్కొండలో గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12705/12706) రైలును ఆపాలంటూ కిషన్ రెడ్డికి నెక్కొండ ప్రజలనుంచి వినతులు అందాయి.

కొంతకాలం క్రితం.. వీరి విజ్ఞప్తిని కిషన్ రెడ్డి.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సానుకూలంగా స్పందించారు. నెక్కొండలో పైన తెలిపిన రైలుకు ఇకపై స్టాప్ ఉంటుందని ఆయన కిషన్ రెడ్డికి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version