టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం?

-

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్-1 టాపర్లు ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు వచ్చాయని, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని కోరారు.

ఒక పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 563-565 వచ్చిన వాళ్లకు 348.5 మార్కులు వచ్చాయి. 800-803 హాల్ టికెట్ అభ్యర్థులకు 351.0 మార్కులు.. 028-031 అభ్యర్థులకు  356.5 మార్కులు.. 377-379 వాళ్లకు 366.5 మార్కులు.. 043-046 వాళ్ళకి 368.5 మార్కులు.. 362-365 వాళ్ళకి 369.0 మార్కులు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 వాళ్ళకి 441.0 మార్కులు.. 240-243 వాళ్ళకి 430.0 మార్కులు.. 395-397 వాళ్ళకి 413.5 మార్కులు.. 260-263 వాళ్ళకి 412.0 మార్కులు.. 201-204 వాళ్ళకి 410.0 మార్కులు.. 395-398 వాళ్ళకి 402.0 మార్కులు రావడంతో ఇందులో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై జ్యుడిషియల్ విచారణ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version