సీఎం రేవంత్ రెడ్డి కి గురుకుల నిరుద్యోగి సవాల్..!

-

తెలంగాణ లో 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలు ఇచ్చింది. ముఖ్యంగా మహిళలకు రూ.2500, రూ.4వేలకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చినటువంటి కొన్ని హామీలను నెరవేర్చించి మరికొన్నింటిని మాత్రం నెరవేర్చలేదు. 

నెరవేర్చని వాటిలో ముఖ్యంగా మహిళలకు రూ.2500 ఇవ్వలేదు. ఇధిలా ఉంటే.. నిరుద్యోగులు కూడా కాస్త ఆందోళనలోనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల నిరుద్యోగి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీ పాలన బాగుంది అని నువ్వు అనుకుంటే సరిపోదు..  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్‌గా నా మీద పోటీ చేసి గెలిచి చూపించు అని సవాల్ చేశారు. అధికారం కోసం హామీలు ఇచ్చి, అధికారం వచ్చాక మా నిరుద్యోగులను తుంగలో తొక్కినారు. మీ గెలుపు కోసం కష్టపడి, జెండాలు మోసిన మా నిరుద్యోగులను ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారంటూ గురుకుల నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version