తెలంగాణ శాసన మండలి సభ్యులు, మాజీ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు. కాసేపటి క్రితమే అంటే… ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ నామినేషన్ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ ఆలీ, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎం ఎస్ ప్రభాకర్ రావు, గొంగిడి సునీత, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు భాను ప్రసాదరావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, యాగ మల్లేశం, జనార్ధన్ రెడ్డి, నవీన్ కుమార్, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.కాగా.. రేపు దీనికి సంబంధించిన ఎన్నిక జరుగనుంది. రేపు ఉదయం 11 గంటల సమయంలో జరిగే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య బలం టీఆర్‌ఎస్ ఎక్కువ ఉండటం, మరేవరూ నామినేషన్లు వేయకపోవడంతో గుత్తా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.