బాలికలు నా కూతురుతో సమానం అన్నారు హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ. స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ..బాలికల గదిలోకి అర్ధరాత్రి చోరబడుతున్నాడట. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడట ఆ అధికారి.
అయితే ఈ సంఘటనపై సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్.. హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ ను సస్పెండ్ చేసింది. అయితే.. ఈ వివాదంపై హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ స్పందించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పై బురదజల్లే ప్రయత్నం ఇదని.. స్పోర్ట్స్ స్కూల్ బాలికలు నన్ను డాడి అని పిలుస్తారని వెల్లడించారు. బాలికలు నా కూతురుతో సమానం…ఎలాంటి అధికారి కూడా లైంగిక వేధింపులు పాల్పడలేదని పేర్కొన్నారు. ఇవన్నీ అవాస్తవం అన్నారు.