మహిళల జోలికి వస్తే.. శిక్ష తప్పదని స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్స్ స్కూలు ఓ ఎస్ డి ని తక్షణం సస్పెండ్ చేశామని.. జరిగిన సంఘటనలపై వాస్తవ నివేదిక సమర్పించాలని 5 గురు సభ్యుల కమిటీని నియమించామని తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన ఘటనపై వచ్చిన వార్త కథన పై మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.