తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలోనే తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు ఉంటాయి. అటు పదోవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగనున్నాయి. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.
ఇది ఇలా ఉండగా…నేడు తెలంగాణ కేబినెట్ భేటీ ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనుంది మంత్రివర్గం. దాదాపు 35 అంశాలతో ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్దతకు ఆమోదంపై తీర్మానం చేయనున్నారు.