హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. శాయంపేట మండలం మాంధారిపేట వద్ద ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడిక్కడే మరణించగా… ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రోజూవారీ కూలీలు మృతి చెందడంతో మృతుల గ్రామంలో విషాదం నింపింది.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….ముగ్గురు దుర్మరణం, పలువురికి గాయాలు
-