Hyd: బోనాల పండుగలో మహిళలకు లైంగిక వేధింపులకు పాల్పడిన…305 మంది అరెస్ట్ అయ్యారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. నగరంలో ఇటివల జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా.. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేశాయి షీ టీమ్స్. 305 మంది వ్యక్తులను అరెస్టు చేసిన షీ టీమ్స్..వీరిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించాయి.
173 మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఐదుగురు వ్యక్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు షీ టీమ్స్ పోలీసులు. మూడు రోజుల జైలు శిక్ష మరియు 1050 జరిమానా విధించారు. జూలైలో మహిళలు మరియు పిల్లలపై నేరాలకు సంబంధించిన 115 కేసులను స్వీకరించారు షీ టీమ్స్. వీటిలో 19 ఎఫ్‌ఐఆర్‌లు హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదు అయ్యాయి. 4 కేసులు పోక్సో చట్టం కింద నమోదు అయ్యాయి. మరో 22 కేసులు వ్యక్తులు మరియు వారి కుటుంబాల సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. షీ టీమ్స్ ఫిర్యాదులలో ఎక్కువ కేసుల్లో అత్యాచారం, మోసం మరియు వివాహం చేసుకుంటాను అంటూ మాయ మాటలు చెప్పినవి ఉన్నాయి.