సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నేను రాజీనామా చేయలేదని రేవంత్ రెడ్డి నన్ను దొంగ అంటున్నాడని.. రుణమాఫీ చెయ్యని గజదొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు.
తాను ఇప్పటికీ రాజీనామాకు కట్టిబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆగస్టు 15లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదన్నారు హరీష్ రావు. రుణమాఫీ పాక్షికంగా మాత్రమే జరిగిందని ఉత్తమ్ కుమారే చెప్పారన్నారు. మీ మంత్రులు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని చెబుతున్నారని.. 100% రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పట్టపగలే 50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రుణమాఫీ పూర్తిగా జరిగిందని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని.. రాహుల్ గాంధీ వస్తే తానే ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుని పూర్తి రుణమాఫీ జరిగిందో లేదో చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి తీసుకువెళ్తానని అన్నారు.